Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

పొలం బాటలో ప్రజ్వలన టీం

 
పొలం బాటలో ప్రజ్వలన టీం
కంటేపుడి, కొర్రపాడు గ్రామాల్లో పర్యటన
రైతులు,వ్యవసాయ కూలీలతో సమావేశం
 
సత్తెనపల్లి,జనవారధి:గత కొంత కాలంగా వర్షాలు లేక పంటలు వేయలేని రైతన్నల పరిస్ధితి,ఉపాధి లేక దిక్కుతోచని స్ధితిలో ఉన్న‌ వ్యవసాయ కూలీల జీవనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రజ్వలన సేవా సంస్ధ.ఈ కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి మండలంలోని కంటెపుడి,మేడికొండూరు మండలంలోని కొర్రపాడు గ్రామాలలో ప్రజ్వలన టీం పర్యటించింది. స్ధానిక రైతులతో సమావేశమైన వారు రైతుల పరిస్ధితులపై ఆరా తీశారు.
 

 
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వర్షాలు లేక,కాల్వలలో నీరు రాక‌ పంటలు వేయలేదన్నారు.పత్తి,మిరప పంటలు వేసిన రైతులు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేస్తాయని పేర్కొన్నారు.కాల్వలలో నీరు రాకపోతే ఈ పంటలు కూడా చేతికి రావని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామన్న రూ.12,500లు తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
 
 
 
పంటలు లేక వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.కార్యక్రమంలో ప్రజ్వలన బృందం సభ్యులు,రైతులు,పలువురు వ్యవసాయ కూలీలు తదితరులున్నారు.

Related News

హలొ వాలంటీరేనా?

అమరావతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

చైర్మన్‌ పదవికి గురిపెట్టిన ఆ..నలుగురు

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: న్యాయవాది బగ్గి

అంబేద్కర్ కృషి మరువలేనిది: టిడిపి

పరివర్తన పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

నెహ్రూ యువ కేంద్రం,ఎడ్యుకేట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి

సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబటి