Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ కు తక్షణమే జీతాలను విడుదల చేయాలి.....

సత్తెనపల్లి, జనవారధి : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ కు గత రెండునెలల పెండింగ్ జీతాలను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని ఎ.పి.అంగన్వాడీ వర్కర్స్&హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జె.లలిత డిమాండ్ చేసారు.బుధవారం సాయంత్రం సత్తెనపల్లి మండలం యన్నాదేవి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమావేశంలో మఖ్య అతిథిగా జె.లలిత పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు గత సంవత్సర కాలంగా అద్దెలు పెండింగులో ఉన్నాయని యజమానులు అంగన్వాడీ నిర్వహించే సిబ్బందిని అద్దె కట్టమని  వత్తిడి చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం పెండింగ్ అద్దె లు చెల్లించాలని,అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలలో రాజకీయ జోక్యం, వత్తిడి, హెరాస్ మెంట్స్ పెరిగాయని వీటీ పరిష్కారానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జె.లలిత డిమాండ్ చేసారు. ఇప్పటికే స్పందన లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తీవ్ర ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని జె.లలిత హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సత్తెనపల్లి అంగన్వాడీ వర్కర్స్ రేపూరి. రాహేల్,అనిత,జి.శ్యామల,వై.అప్పమ్మ,నంబుల.శివపార్వతి,నాగమల్లేశ్వరి,స్వర్ణ,శాంతి,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related News

హలొ వాలంటీరేనా?

అమరావతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

చైర్మన్‌ పదవికి గురిపెట్టిన ఆ..నలుగురు

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: న్యాయవాది బగ్గి

అంబేద్కర్ కృషి మరువలేనిది: టిడిపి

పరివర్తన పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

నెహ్రూ యువ కేంద్రం,ఎడ్యుకేట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి

సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబటి